అమిత్ షాకు బర్త్ డే విషెస్ తెలిపిన టీడీపీ అధినేత చంద్రబాబు

కేంద్ర హోంమంత్రి అమిత్ షా పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్బంగా బిజెపి నేతలు, కార్య కర్తలే కాక ఇతర పార్టీ నేతలు సైతం అమిత్ షా కు పెద్ద ఎత్తున పుట్టిన రోజు శుభాకాంక్షలు అందజేశారు. వారిలో టీడీపీ అధినేత , మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఉన్నారు. శనివారం మధ్యాహ్నం సోషల్ మీడియా వేదికగా అమిత్ షాకు చంద్రబాబు జన్మదిన శభాకాంక్షలు తెలిపారు. అమిత్ షాకు ఆయురారోగ్యాలు సిద్దించాలని చంద్రబాబు కోరారు.

సోషల్ మీడియా వేదికగా అమిత్ షాకు బర్త్ డే విషెస్ చెప్పినప్పటికీ…ఆ తర్వాత కేంద్ర హోం మంత్రికి చంద్రబాబు స్వయంగా ఫోన్ చేశారు. ఈ సందర్భంగా అమిత్ షాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు… అమిత్ షా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబుకు అమిత్ షా ధన్యవాదాలు తెలియజేశారు.