టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకి వ్యతిరేకంగా పోస్టర్లు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా టిఆర్ఎస్ ఎమ్మెల్యే ల కొనుగోలు వ్యవహారం చర్చ కు దారితీసింది. ప్రస్తుతం ఈ కేసుకు సంబధించి సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు నడుపుతున్నారు. మరోవైపు ఈ కొంగలు వ్యవహారంలో ఉన్న నలుగురు ఎమ్మెల్యే లు పోలిసుల భద్రతా నడుమ ఇంట్లో నుండి బయటకు రావడం లేదు. ఇదిలా ఉంటె తాజాగా ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకి వ్యతిరేకంగా పోస్టర్లు వెలువడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

‘అచ్చంపేట ఆత్మగౌరవంను రూ.100 కోట్లకు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అమ్ముకున్నాడు.. ఓట్లు వేసి గెలిపించిన ప్రజల్లారా, యువకుల్లారా, మేధవుల్లారా, విద్యావంతుల్లారా ఒక్కసారి ఆలోచించండి. ఎటుపోతుంది మన అచ్చంపేట ఆత్మగౌరవం’ అంటూ పోస్టర్లలో కనిపిస్తోంది. ‘ఎమ్మెల్యేను అచ్చంపేట పొలిమేర దాటే వరకు తరిమికొడదాం.. మన అచ్చంపేట ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం’ అంటూ పోస్టర్లలో ఉంది. నియోజకవర్గంలో పలు సందర్భాల్లో జరిగిన ఘటనలకు సంబంధించిన ఫొటోలను ఈ పోస్టర్లలో పొందుపర్చారు. వికలాంగుడు శ్రీనుపై దాడి, గిరిజన సర్పంచ్‌పై దాడి, ఎమ్మెల్యే ఆఫీస్‌ను ముట్టడించిన కార్యకర్తలపై రాళ్ల దాడి ఘటనలను పోస్టర్లలో ప్రస్తావించారు. అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఈ పోస్టర్లు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

ఈ పోస్టర్ల ఫై స్థానిక టీఆర్ఎస్ నేతలు సీరియస్ అవుతున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు రెడీ అవుతోన్నారు. ఎమ్మెల్యే ప్రతిష్టను దిగజార్చేందుకు ఇలా పోస్టర్లు ఏర్పాటు చేస్తోన్నారని ఆరోపిస్తోన్నారు. ఇదంతా ప్రత్యర్థుల ప్లాన్ అంటూ స్థానిక గులాబీ శ్రేణులు అనుమానాలు వ్యక్తం చేస్తోన్నారు.