అనంతపురం లో గణేష్ నిమజ్జనం లో అపశృతి..

గణేష్ నవరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయి. ఊరువాడా గణనాథుడు కొలువుతీరాయి. భక్తులంతా ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయక ఉత్సవాలను జరుపుకుంటున్న వేళ ఆ రెండు కుటుంబాల్లో మాత్రం తీరని విషాదం నింపిన ఘటన అనంతపురంలో చోటు చేసుకుంది. పట్టణంలోని సాయినగర్‌ వాసులు గణేశ్‌ ఉత్సవాల అనంతరం పూజాది కార్యక్రమాలను నిర్వహించి ఈరోజు నిమజ్జనం కోసం రాప్తాడు పండమేరు కాలువకు వెళ్లారు.

కాగా నిమజ్జనం చేస్తుండగా నీటి ప్రవాహానికి నలుగురు నీటిలో పడిపోయారు. వారిలో ఇద్దరు ప్రాణాలతో బయటపడగా శ్రీరాములు, జయశ్రీ అనే బాలిక ప్రవాహంలో కొట్టుకుపోయారు. శ్రీరాములు మృతదేహం లభ్యంకాగా గల్లంతైన అమ్మాయి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన తో ఆ గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.