ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 8మందికి పాజిటివ్‌

బ్రిటన్‌ వైరస్‌పై ప్రపంచదేశాల కలవరం

Delhi Airport
Delhi Airport

New Delhi: బ్రిటన్‌లో గుర్తించిన కొత్త కరోనాతో యూరోపియన్‌ దేశాలు ఎక్కువ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనికితోడు బ్రిటన్‌నుంచి వచ్చిన ఎయిర్‌ ఇండియా ప్రయాణీకుల్లో ఆరుగురికి కరోనా సోకడంతో భారత్‌లోనూ బ్రిటన్‌ ప్రయాణీకులపై ఎక్కువ ఫోకస్‌పెట్టి పరీక్షలు నిర్వహిస్తున్నారు.

బ్రిటన్‌ కరోనా వైరస్‌ కారణంగా యూరోపి యన్‌ దేశాల్లోని స్పెయిన్‌లో అత్యవసర పరిస్థితిని మార్చి వరకూ ప్రకటించింది. బ్రిటన్‌లో ఇప్పటికే ఒకనెల రోజుల పాటు లాక్‌డౌన్‌ ప్రకటిస్తే ఫ్రాన్స్‌లో దేశవ్యా ప్తంగా రెండు వారాల పాటులాక్‌డౌన్‌ విధించారు. జర్మనీలో కూడా నాలుగువారాలు, ఇటలీ దేశంకూడా లాక్‌డౌన్‌ దిశగానే అడుగులువేస్తోంది.

కరోనా రెండోవేవ్‌ ఉధృతంగా ఉన్నందున లాక్‌డౌన్‌ అమ లుచేయక తప్పదన్న భావనతో ఈ దేశాలపాలకులు లాక్‌డౌన్‌ ప్రకటించారు. అన్ని జాగ్రత్తలు తీసు కుంటూనే మరింత కఠిన కార్యాచరణ అమలు చేయాలని నిర్ణయించారు. రెండోదశనుంచి అందరినీ రక్షించుకోవాలని, అన్ని కుటుంబాలు సహకరిం చాలన్న పిలుపునిచ్చాయి.

మొదటిదశకంటే రెండోదశ కరోనా మరింత తీవ్రమైనదని 1917 నుంచి 1919 వరకూ స్పానిష్‌ఫ్లూ తరహాలోనే విస్తరిస్తుందని మిలియన్లకొద్దీ ప్రజలు ఆనాడు చనిపోయిన సంఘ టనలను గుర్తుచేస్తున్నారు. ఇప్పటివరకూ ప్రపంచం లోని సుమారు 40కిపైగా దేశాలు బ్రిటన్‌దేశంనుంచి వచ్చే అంతర్జాతీయ విమానసర్వీసులను నిషేధిం చాయి. ఈ నెలా ఖరు వరకూ ప్రస్తుతం నిషేధం విధించినా మరికొన్ని దేశాలు జనవరి నెలాఖరు వరకూ కూడా ప్రకటించాయి.

లండన్‌నుంచి వేరువేరు విమానాల్లో వచ్చిన ప్రయాణీకుల్లో ఎనిమిది మందికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ విమానంలోనే వీరంతా వచ్చారు. మిగిలినవారికి మాత్రం కరోనా నెగిటివ్‌వ చ్చింది.

దీనితో ఎయిర్‌పోర్టుల్లోనే ఆర్‌టిపిసిఆర్‌ పరీక్షలు నిర్వహించి పాజిటివ్‌వస్తే సంస్థాగత క్వారంటైన్‌, లేనిపక్షంలో హోంక్వారంటైన్‌కు వెళ్లాలని సూచనలు జారీ చేస్తున్నారు.

ప్రపంచ ఆరోగ్యసంస్థ ముఖ్య శాస్త్రవేత్త డా.సౌమ్య స్వామినాథన్‌ మాట్లాడుతూ కరోనా కొత్తవైరస్‌ ఇప్పటికే కొన్ని దేశాలకు వ్యాపించిందని, ఈవైరస్‌ సుమారు 17 గణనీయ మైన మార్పులతో వస్తోందని ఇప్పటికే ఇటలీ, ఆస్ట్రే లియా, డెన్మార్క్‌, నెదర్లాండ్స్‌ దేశాల్లో గుర్తించారని, కొత్తగా దక్షిణాఫ్రికాలో కూడా బయటపడిందని పేర్కొ న్నారు.

ఈ కొత్తవైరస్‌ దుష్పరిణామాలపై ఇప్పటికే ఒకనిర్ధారణకు రాలేమని, ప్రాథమికంగాచూస్తే తొలి దశలో వ్యాపిం చిన కరోనాకంటే 70శాతం వేగంగా వ్యాపిస్తుందని, ప్రస్తుత కొవిడ్‌వ్యాక్సిన్‌లు ఈ కొత్తవై రస్‌పై పనిచేస్తాయని వెల్లడించారు. యూరోపియన్‌ యూనియన్‌వైద్య క్రమబద్దీకరణ సంస్థ మాట్లాడుతూ ఫైజర్‌ వ్యాక్సిన్‌ కొత్తవైరస్‌ను కట్టడిచేయగలదని ప్రకటించింది.

ఇప్పటికే యుకెలో పంపిణీ అవు తోంది. అమెరికా, యూరోపియన్‌యూనియన్‌ రాష్ట్రాలుకూడా ఈ వ్యాక్సిన్‌ను ఆమోదించాయి. ఇక రష్యాస్పుత్నిక్‌ వి వ్యాక్సిన్‌ను భారత్‌లో ఉత్పత్తి చేస్తోంది. వచ్చే ఏడాదికల్లా 30కోట్ల డోసులు ఉత్పత్తి అవుతుందని, ఈకొత్తవైరస్‌పై కూడాశక్తి వంతంగా పని చేస్తుందని ప్రకటించింది. భారత్‌లో కూడా అత్య వసర వినియోగానికి దరఖాస్తుచేసింది.

గత వారంలోనే కేంద్రఆరోగ్యమంత్రి హర్షవర్ధన్‌ బ్రిటన్‌ వైరస్‌పై ఆందోళన చెందవద్దని ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని వెల్లడించారు. ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తంగా ఉందని తెలిపారు.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/