కరోనా వేళ జల్లికట్టు.. ఓకే అనేసిన ప్రభుత్వం!

యావత్ ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కరోనా వైరస్ భయం ఇంకా పూర్తిగా తొలిగిపోలేదు. ఈ మహమ్మారి ఎప్పుడు, ఎవరికి సోకుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రజలందరూ భయబ్రాంతులకు గురవుతున్నారు. అయితే కరోనా నుండి తమను తాము కాపాడుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. కాగా కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ తమ రోజూవారి కార్యక్రమాలను మాత్రం కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే పండుగలకు, వేడుకలకు ప్రభుత్వం ఇంకా ఎలాంటి అనుమతులు ఇవ్వకపోవడంతో ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

అయితే సంక్రాంతి పండుగ అనగానే దేశవ్యాప్తంగా గుర్తుకువచ్చేది జల్లికట్టు. సంక్రాంతి పండుగ అంటే జల్లికట్టు ఉండాల్సిందే అంటారు తమిళ ప్రజలు. ఈ జల్లికట్టుకు అంత ప్రాధాన్యత ఉంటుందని, అందుకే ఏదేమైనా తాము ఈ వేడుకను జరిపి తీరుతామని తమిళ ప్రజలు కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే. అయితే కరోనా నేపథ్యంలో జల్లికట్టు నిర్వహిస్తారా లేదా అనే సందేహం అందరిలో నెలకొంది. కాగా కరోనా నేపథ్యంలో జాగ్రత్తలు పాటిస్తూ జల్లికట్టు వేడుకను నిర్వహించుకోవచ్చని తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జల్లికట్టు నిర్వహణపై తమిళనాడు ప్రభుత్వం మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. కోవిడ్-19 నెగెటివ్ సర్టిఫికెట్ ఉంటేనే జల్లికట్టులో పాల్గొనాలని, సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు, శానిటైజర్లు వాడాలని ప్రభుత్వం ఆదేశించింది.

మొత్తానికి కరోనా నేపథ్యంలో కూడా జల్లికట్టు వేడుకకు ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని తమిళనాడు ప్రభుత్వం దాని నిర్వహణకు అనుమతినివ్వడంతో తమిళనాడు ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈసారి జల్లికట్టులో ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో చూడాలి అంటున్నారు అక్కడివారు.