పవన్ కళ్యాణ్ ఫై పోసాని ఆగ్రహం ..

ప్రస్తుతం చిత్రసీమ లోనే కాదు ఏపీ రాజకీయాల్లో కూడా పవన్ తీరు ఫై అంత తప్పు పడుతున్నారు.సినిమా ఫంక్షన్లో వైసీపీ నేతల ఫై పవన్ మాట్లాడిన తీరుపై సినీ పెద్దలు సైతం ఆగ్రహం వ్యక్తం చేయగా..తాజాగా ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి సైతం పవన్ ఫై మండిపడ్డారు. పవన్‌ మాట్లాడిన బాష సరిగా లేదని , చిరంజీవి నోటి నుంచి అమర్యాద పదాలు ఎప్పుడైనా వచ్చాయా అని ప్రశ్నించారు.

రిపబ్లిక్‌ సినిమా ఫంక్షన్‌లో సీఎం, మంత్రులను తిట్టడం ఏంటని పోసాని నిలదీశారు. పవన్‌ కల్యాణ్‌ రెండు నియోజక వర్గాల్లో ఉన్నారు. రెండు చోట్ల తిరిగారు, ఒక్కచోట అయినా గెలవగలిగారా అని పోసాని ప్రశ్నించారు. జగన్‌తో పోల్చుకునే వ్యక్తిత్వం పవన్‌ కల్యాణ్‌కు లేదని , జగన్‌ పనితీరును దేశమంతా గుర్తించిందన్నారు. పవన్‌ కల్యాణ్‌ ఏంటో సినీ పరిశ్రమకు, ప్రపంచానికి బాగా తెలుసు. జగన్‌తో మీకు పోలికే లేదు. సీఎం జగన్‌కు కులపిచ్చి ఉందని నిరూపించగలరా. అవకాశాల పేరుతో పంజాబ్‌ అమ్మాయిని ఓ వ్యక్తి మోసం చేశాడు. విషయం బయట పెడితే చంపేస్తానని బెదిరించినట్లు తెలిసింది. ఈ విషయం నేనే స్వయంగా విన్నాను. బాధితురాలికి న్యాయ చేయడానికి పవన్‌ ఎందుకు ముందుకు రాలేదు. బాధితురాలికి న్యాయం చేస్తే పవన్‌కు గుడికడతాను. సినిమా పరిశ్రమలో సమస్యలను పవన్‌ పరిష్కరించగలరు ‘ అని పోసాని మీడియా తో అన్నారు.