ఓవర్సీస్ లో రికార్డులు తిరగరాస్తున్న లవ్ స్టోరీ

లవ్ స్టోరీ మూవీ తో మళ్లీ థియేటర్స్ దగ్గర అసలైన సినీ సందడి మొదలైంది. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో నాగ చైతన్య – సాయి పల్లవి జంటగా తెరకెక్కిన ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో అన్ని థియేటర్స్ వద్ద ప్రేక్షకుల కోలాహలం కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ వద్ద కూడా సరికొత్త రికార్డ్స్ తిరగరాస్తుంది.

అమెరికాలో ల‌వ్‌స్టోరీ విడుద‌లైన 3 రోజుల్లోనే 1 మిలియ‌న్ డాల‌ర్ల (రూ.7 కోట్ల 37 ల‌క్ష‌లు) వసూళ్లు రాబట్టింది. ఆదివారం రాత్రి వ‌ర‌కు 2021లో అత్య‌ధిక గ్రాస్ సాధించిన తెలుగు సినిమాగా ల‌వ్‌స్టోరీ నిలిచింది.
కరోనా సెకండ్‌ వేవ్‌ తర్వాత వరల్డ్ వైడ్ గా రికార్డుల స్థాయిలో వసూళ్లు రాబట్టిన తొలి చిత్రంగా లవ్‌స్టోరీ నిలిచింది. మూడు రోజుల్లో యూఎస్‌లో 1 మిలియన్ల డాలర్ల క్ల‌బ్‌లోకి లవ్‌స్టోరీ చేరటం విశేషం. దీంతో ల‌వ్‌స్టోరీ 2 మిలియ‌న్ల డాల‌ర్ల మైల్‌స్టోన్ దిశ‌గా వెళ్ల‌డం ఖాయమని సినీ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.