బిచ్చగాడు 2 ట్రైలర్ రిలీజ్

బిచ్చగాడు సీక్వెల్ గా వస్తున్న బిచ్చగాడు 2 తాలూకా ట్రైలర్ ను శుక్రవారం మేకర్స్ విడుదల చేసారు. 2016లో బిచ్చగాడు మూవీ తెలుగు లో ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేక చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై, మౌత్ టాక్ అఖండ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో విజయ్ ఆంటోని పేరు తెలుగు లో మారుమోగిపోయింది. ముఖ్యంగా ఈ సినిమాలోని అమ్మ సెటిమెంట్ ప్రతిఒక్కరిని కదిలించింది. క్లాస్ మాస్ అనే తేడాలేకుండా అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది బిచ్చగాడు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రూపొందిస్తోన్నారు. పిచ్చైకారన్2 అనే టైటిల్‌‌‌‌తో ఈ సినిమా తెరకెక్కిస్తోన్నారు. అలాగే ఈ సినిమాను తెలుగులో బిచ్చగాడు 2 పేరుతో డబ్ చేస్తున్నారు. కాగా సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం తాలూకా ట్రైలర్ ను విడుదల చేసి ఆసక్తి నింపారు.

‘స్నీక్ పీక్ ట్రైలర్’ అంటూ సినిమా ఓపెనింగ్ సన్నివేశాన్ని విడుదల చేసి అంచనాలు పెంచారు మేకర్స్. ఈ ప్రచారం చూస్తుంటే మనిషి మెదడుపై రీసెర్చ్ చేసే కథాంశంతో రూపొందినట్లు తెలుస్తోంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. సన్నివేశాలు ఎంతో ఆసక్తిగా సాగుతూ కనిపించింది. ఇకపోతే ఈ సినిమాలో విజయ్ ఆంటోని హీరోగా నటించడమే కాకుండా ఈసినిమాకు దర్శకత్వం కూడా వహించారు. అంతేకాదు సంగీతాన్ని కూడా అందిస్తున్నారు. ఇక కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. దేవ్ గిల్ హరీష్ పెరడి జాన్ విజయ్ రాధా రవి మన్సూర్ అలీ ఖాన్ వైజీ మహేంద్రన్ రాజా కృష్ణమూర్తి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ ఓం నారాయణన్ అందిస్తున్నారు.

YouTube video