పోసానికి కీలక పదవి అప్పగించిన జగన్ సర్కార్

వైస్సార్సీపీ లో చేరిన సినీ ప్రముఖులకు జగన్ కీలక పదవులు అప్పగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే అలీకి ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవి అప్పగించింది. ఇక ఇప్పుడు పోసాని కృష్ణ మురళి ఓ కీలక పదవి అప్పగించారు. ఏపీ ఏఫ్ డీసీ (ఫిల్మ్ డెవలప్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేష్) కు చైర్మన్ గా బాధ్యతల్ని అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. ఈ మేరకు శుక్రవారం పోసాని ఆ బాధ్యతలను స్వీకరించి విజయవాడలోని ఎన్. టి. రామారావు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లోని తన కార్యాలయంలోకి ప్రవేశించారు.

ఈ సందర్భంగా చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన పోసాని కృష్ణ మురళి తనని నమ్మి తనపై ఇంతటి బరువు బాధ్యతల్ని పెట్టిన సీఎం వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. అంతే కాకుండా తనపై పెట్టిన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తానని చెప్పుకొచ్చారు. గత కొంత కాలంగా సోసాని మురళీకృష్ణ ఏపీ ప్రభుత్వానికి సీఎం జగన్ కు వీర విధేయులుగా వుంటూ వస్తున్నారు. అంతే కాదు జగన్ ప్రభుత్వం ఫై ఎవరైనా విమర్శలు చేసిన వారికి స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తూ తమ స్వామి భక్తిని ప్రదర్శిస్తూ వస్తున్నారు.