పంజాబీ బ్యూటీ హ్యాపీ నెస్

పిల్లలతో కలిసి సరదాగా ఫోటో పోస్ట్ చేసిన పూనమ్ కౌర్

Poonam kaur new post
Poonam kaur new post

పంజాబీ బ్యూటీ పూనమ్ కౌర్ .. సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ .. సినీ రాజకీయ సామాజిక అంశాలపై వివిధ సందర్భాల్లో తన అభిప్రాయాలను వెల్లడిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు వైరాగ్యంతో కూడిన ట్వీట్లు పెడుతూ.. పరోక్షంగా ఎవరి గురించో చెప్పాలని ట్రై చేస్తుంటుంది. కొన్ని వివాదాస్పద ట్వీట్లు చేయడం.. ట్రోల్స్ వచ్చిన వెంటనే వాటిని డిలీట్ చేయడం మాములే. అలానే #PKlove అనే హ్యాష్ ట్యాగ్ తో ఫోటోలు పోస్ట్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట సందడి చేస్తోంది.హ్యాపీ నెస్ అంటూ ఇద్దరు పిల్లలతో కలిసి ఉన్న ఫోటోని పంచుకుంది పూనమ్. అయితే ఆ కిడ్స్ ఎవరనేది అమ్మడు మెన్షన్ చేయలేదు. దీంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఫొటోలో పూనమ్ నల్లగా కనిపించడం చూసి.. సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పిక్స్ పోస్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి కదా అని కామెంట్స్ చేస్తున్నారు. పూనమ్ కౌర్ కు ఇంకా పెళ్లి కాలేదనే సంగతి తెలిసిందే. కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న పూనమ్.. ఇటీవల ‘నాతి చరామి’ చిత్రం లో నటించింది

జాతీయ వార్తల కోసం: https://www.vaartha.com/news/national/