ఖుషి నుండి నా రోజా నువ్వే ఫుల్ సాంగ్ విదుదల

నేడు విజయ్ దేవరకొండ పుట్టిన రోజు సందర్బంగా ఖుషి మూవీ నుండి నా రోజా నువ్వే ఫుల్ సాంగ్ విడుదలైంది. విజయ్ దేవరకొండ – సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఖుషి చిత్రాన్ని ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి ప్రేమ కథల్ని తెరకెక్కించిన శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్నాడు. వాస్తవానికి ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకోవాల్సి ఉండగా..మధ్యలో సమంత అనారోగ్యానికి గురి కావడం తో షూటింగ్ మధ్యలో ఆగిపోయింది. రీసెంట్ గా సమంత అనారోగ్యం నుండి బయటపడడంతో మళ్లీ షూటింగ్ మొదలుపెట్టుకుంది.

సెప్టెంబర్ 1 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో నేడు సినిమాలోని ‘నా రోజా నువ్వే’ అంటూ సాగే పాట ను రిలీజ్ చేసారు. మొత్తం ఐదు భాషల్లో ఈ పాట వచ్చింది. ఈ సాంగ్ లో సమంత విజయ్ ఇద్దరి కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. ఈ సాంగ్ ను సంగీత దర్శకుడు హేషామ్ అబ్దుల్ వాహాబ్ ఆలపించారు. ఖుషీ మూవీకి హేషామ్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సాంగ్ లో సమంత కశ్మీరీ ముస్లిం యువతిగా కనిపిస్తోంది. వీరిద్దరి మధ్య జరిగే ప్రేమ వ్యవహారమే నేపథ్యంగా ఖుషీ మూవీ తెరకెక్కుతోంది. మైత్రి మూవీ మేకర్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

YouTube video