ఉస్తాద్ భగత్ సింగ్ పోస్టర్ ఫై పూనమ్ కౌర్ కామెంట్స్..ఆగ్రహంతో ఊగిపోతున్న ఫ్యాన్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కలయికలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గబ్బర్ సింగ్ మూవీ తర్వాత మరోసారి వీరిద్దరి కలయికలో సినిమా వస్తుండడం తో అభిమానుల అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా..ఈ మూవీ తాలూకా ఫస్ట్ లుక్ పోస్టర్ గురువారం ఉదయం మేకర్స్ రిలీజ్ చేసారు. ఈ మూవీ పోస్టర్ లో పవన్ లుక్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలో నటి పూనమ్ కౌర్ పోస్టర్ లో ఉన్న టైటిల్ ఫై కామెంట్స్ చేసి పోస్టర్ ను వివాదంలోకి నెట్టిసింది.

ఈ పోస్టర్ లో భగత్ సింగ్ పేరును హీరో కాళ్ల దగ్గర ఉంచారు. ఇదే విషయాన్ని తప్పు పట్టిన ఆమె.. మూవీ టీమ్ పై కామెంట్స్ చేసింది. “భగత్ సింగ్ లాంటి గొప్ప వ్యక్తి పేరును టైటిల్ పోస్టర్ లో, కింద పెట్టడం అనేది ఆయనను ఇన్సల్ట్ చెయ్యడమే అవుతుంది. ఇది మీ ఈగోనా.. లేక నిర్లక్ష్యమా అంటూ పూనమ్ ఫైర్ అయ్యింది. ప్రస్తుతం పూనమ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారుతున్నాయి. ఇక పూనమ్ చేసిన ఈ కామెంట్స్ కు పవన్ ఫ్యాన్స్ తమ స్టైల్లో రిప్లై ఇస్తున్నారు. అటెన్షన్ సీకర్ వచ్చింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ ఇష్యూపై మూవీ టీమ్ ఎలా స్పందింస్తుందో చూడాలి మరి.