సుమలోని టాలెంట్ లో 10శాతం టీమ్ పెట్టినా పెద్ద హిట్ : నాగార్జున
‘జయమ్మ పంచాయితీ’ ప్రీ రిలీజ్ వేడుక

`ఇది ప్రీరిలీజ్ లా లేదు. ఇక్కడొక పండుగ లా వుందంటూ.. జయమ్మ పంచాయితీ ప్రీ రిలీజ్ వేడుకకు హాజరైన అభిమాననులు, ప్రేక్షకులనుద్దేశించి అక్కినేని నాగార్జున అన్నారు. బుల్లితెర స్టార్‌మహిళగా ఎదిగిన సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జయమ్మ పంచాయితీ`. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ నిర్మించగా విజయ్ కుమార్ కలివరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మే 6 సినిమా విడుదలకానుంది. హైదరాబాద్ దస్‌పల్లాలో జయమ్మ కంప్లయింట్ అనే పేరుతో జయమ్మ పంచాయితీ ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. అక్కినేని నాగార్జున మాట్లాడుతూ, ఇక్కడ పండుగ లా వుంది. పంచాయతీ అంటే నేను రాలేదు. ప్రేమతో సుమ పిలిస్తే వచ్చాను. ఈ చిత్ర టీమ్ అంతా సుమలోని టాలెంట్ లో 10శాతం పెట్టినా పెద్ద హిట్ అవుతుందంటూ ఆల్ ది బెస్ట్ తెలిపారు.
నాని మాట్లాడుతూ, దేవదాస్ తర్వాత నాగ్ సార్ తో ఇలా కలిశాం. సుమ నటించిన సినిమాకు మేం గెస్ట్‌గా రావడం కొత్తగా వుంది. మనందరి ఇంటిలో మనిషిగా సుమగారు అయ్యారు. ఇండస్ట్రీకి ఆమె చాలా చేశారు. ప్రతి సినిమా విడుదలకు ముందు సుమగారు అనే పేరు, ఆమె నవ్వు పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. జయమ్మ పంచాయితీ ట్రైలర్ చూశాక, స్టేజీ మీదేకాదు వెండితెరపై కూడా అలరించిందనిపించింది. కీరవాణి సంగీతం తోడయి సినిమా చూడాలనే ఆసక్తినెలకొంది. సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలనీ, సుమగారు సినిమాలతో బిజీ కావాలని కోరుకుంటున్నానని అన్నారు.
సంగీత దర్శకుడు కీరవాణి మాట్లాడుతూ, నిర్మాత బలగా ప్రసాద్ కు బి.పి. పెరిగినట్లుగా వసూళ్ళు రావాలని చమత్కరించారు. అందరూ సినిమా చూసి ఆదరించాలి. అందం, తెలివితేటలు, మంచి మనసు వున్న సుమగారికి రాజీవ్ కనకాల (ఆర్.కె.) వుంటే చాలని పేర్కొన్నారు.
సుమ మాట్లాడుతూ, ఇంటిలో టీవీలేనిరోజుల్లో పక్కఇంటిలో టీవీచూసిన రోజులనుంచి టీవీహోస్ట్ గా ఎదిగి ఎనర్జీగా మాట్లాడుతున్నానంటే మీ చప్పట్ల వల్ల వచ్చిన ఎనర్జీనే కారణం. మన ఇంటిలోని అమ్మాయిగా భావించడం వల్లే నాకు ఎనర్జీ వచ్చింది. మీ ప్రేమ ఆదరాభిమానాలతో తెలుగు టీవీ హోస్ట్ గా చేయడం గర్వంగా ఫీలవుతున్నాను. చిత్ర దర్శకుడు, నిర్మాత, నటించిన నటీనటులతోపాటు కీరవాణిగారి సంగీతం మా సినిమాకు బలం చేకూరింది. నాకు శ్రీకాకుళం యాస రాదు. కానీ నాకు నేర్పించిన టీమ్ కు ధన్యవాదాలు. ఈ సినిమాకు రామ్‌చరణ్, నాని, నాగార్జున, రాజమౌళి, త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ ప్రమోట్ చేయడం వల్లే హైప్ వచ్చింది. సినిమా విడుదలకు సురేష్ ప్రొడక్షన్స్, ఏషియన్ సునీల్‌గారు సహకారం ఎంతో వుంది. ఆల్ హీరో ఫ్యాన్స్ నా సినిమా చూస్తారని ఆశిస్తున్నానని అంటూ, మహేష్‌బాబుగారు మే3న కొత్త ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారని తెలిపారు.
చిత్ర దర్శకుడు విజయ్ మాట్లాడుతూ, ఓసారి జర్నీ చేస్తుండగా ఓ సైంటిస్ట్ కలిసి నేను దర్శకుడు అని తెలిసి సెల్ఫీ తీసుకున్నాడు. జయమ్మ పంచాయితీ మోషన్ పోస్టర్ ను రామ్‌చరణ్ ఆవిష్కరించాడనే విషయాన్ని ఆయన ప్రస్తావించారు..
ఈ కార్యక్రమానికి వ్యక్తిగత పనుల వల్ల హాజరుకాలేకపోతున్నామనీ రాజమౌళి, కె. రాఘవేంద్రరావు వీడియో ద్వారా తెలియజేస్తూ, జయమ్మ పంచాయితీ సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు.రాజీవ్ కనకాల, గాయకుడు శ్రీకృష్ణ, కెమెరామెన్ అనూష్, దినేష్ కుమార్, షాలినీ తదితరులు పాల్గొన్నారు.
‘చెలి’ (మహిళల ప్రత్యేకం) వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/women/