జనగర్జన సభను ఫెయిల్ చేయడానికి.. బీఆర్ఎస్ కుట్రలు – పొంగులేటి

నేడు ఖమ్మం లో కాంగ్రెస్ పార్టీ జనగర్జన పేరుతో భారీ సభ నిర్వహించబోతుంది. ఇప్పటికే దీనికి సంబదించిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ సభకు సుమారు ఐదు లక్షల మంది హాజరువుతారని పార్టీ నేతలు చెపుతున్నారు. ఈ సభకు ముఖ్య అతిధిగా రాహుల్ గాంధీ తో పాటు కర్ణాటక డీప్యూటీ సీఎం డీకే శివకుమార్‌, టీపీసీసీ అధ్యక్షుడు రేవంతరెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కేంద్ర మాజీమంత్రి రేణుకాచౌదరి, రాష్ట్రానికి చెందిన పలువురు కాంగ్రెస్‌ ఎంపీలు, మాజీ ఎంపీలు, ఏఐసీసీ, పీసీసీ నేతలు ఈ సభకు హాజరుకానున్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితోపాటు మరికొందరు ఇతర జిల్లాల నేతలు అదే సభలో కాంగ్రెస్ పార్టీ లో చేరబోతుండటంతో కాంగ్రెస్ పార్టీ కూడా ఈసభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

అయితే ఈ సభను ఫెయిల్ చేయడానికి బీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని కేసీఆర్‌ ప్రభుత్వం ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఆర్టీసీ బస్సులు ఇవ్వకపోయినా, జనాలు స్వచ్ఛందంగా వస్తారని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. 15 వేల వాహనాలు రావడానికి సిద్ధంగా ఉన్నాయని.. వాహనాల సీ బుక్‌లను అధికారులు బలవంతంగా తీసుకుంటున్నారని అన్నారు. అవసరమైతే నేను రోడ్డు మీదకు వస్తానని తెలిపారు.