ఐఈడీని పేల్చిన మావోలు.. 12 మందికి గాయాలు

దంతెవాడ : ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో గురువారం వాహనాన్ని ఐఈడీ సహాయంతో మావోయిస్టులు పేల్చి వేశారు. ఈ ఘటనలో నారాయణపూర్‌ జిల్లా నుంచి దంతేవాడ వస్తున్న ఓ బొలెరో వాహనం ధ్వంసం కావడంతో 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూ ఒకరు మరణించారు. ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా దళాలు మలేవాహి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మావోయిస్టుల కోసం కూంబింగ్‌ కొనసాగిస్తున్నారు.

కాగా, భద్రతా దళాలే లక్ష్యంగా నక్సల్స్‌ ఐఈడీని పేల్చారని, పొరపాటున జనం వెళ్తున్న వాహనంపై దాడి చేసి ఉంటారని జిల్లా ఎస్పీ అభిషేక్‌ పల్లవ పేర్కొన్నారు. అయితే, ఆ మార్గంలో వెళ్లే సమయంలో పోలీసులు ఎప్పుడూ నాలుగు చక్రాల వాహనాలను వినియోగించరని తెలిపారు.

తాజా వీడియో వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/videos/