పేపర్ లీక్ కేసును సిబిఐ కి అప్పగించాలంటూ పొంగులేటి డిమాండ్

Ponguleti Srinivasa Reddy
Ponguleti Srinivasa Reddy

తెలంగాణ రాష్ట్రంలో TSPSC పేపర్ లీక్ ఘటన సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ లీకేజ్ కి పాల్పడిన నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మరోపక్క ఈ పేపర్ లీక్ ఫై యావత్ విద్యార్థి సంఘాలు , ప్రతిపక్ష పార్టీలు ఆందోళనలు , నిరసనలు చేస్తూ ప్రభుత్వం ఫై విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే జాతీయ నేతల దగ్గరి నుండి గల్లీ నేతల వరకు ఈ ఇష్యూ ఫై స్పందించగా..తాజాగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వం ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. పేపర్ లీక్ కేసును సిబిఐకి లేదా సిట్టింగ్ జడ్జీ తో విచారణ చేయాలని డిమాండ్ చేశారు. పరీకలు రద్దు చేసి విద్యార్ధుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. మళ్లీ రెండు నెలల్లో పరీక్షలు పెట్టి అర్హులైన వారికి ఉద్యోగాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు.

2018 ఎన్నికల్లో నిరుద్యోగ బృతి హామీ ఇచ్చారు కానీ.. ఒక్క రూపాయ నిరుద్యోగ బృతి ఇవ్వలేదని, ఎన్నికలు వచ్చే సరికి మళ్లీ నిరుద్యోగులు సీఎం కేసీఆర్ కు గుర్తుకు వస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని డిమాండ్ చేసారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు, నిదులు , నియమాకాలు , భద్రాచలం దేవాలయ అభివృద్ది జరుగలేదన్నారు. నిదులు, నీళ్లు, నియమాకాలు అన్ని కల్వకుంట్ల కుటుంబానికే చెందుతున్నాయని… ప్రజలకు ఒరిగింది ఏమి లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో జెండా ఏది అయిన ఎజెండా ఒక్కటేనని.. రాష్ర్ట ముఖ్యమంత్రి ని గద్దెదించడమే తన లక్యం అన్నారు.