జీ7 సదస్సుకు భారత్‌ను తప్పకుండా ఆహ్వానిస్తాం : జర్మనీ

బెర్లిన్ : జీ7 సదస్సుకు భారత్‌ను ఆహ్వానిస్తారా? లేదా? అనే వార్తల పై జర్మనీ స్పందించింది. జీ7 సదస్సుకు భారత్‌ను తప్పకుండా ఆహ్వానిస్తామని అతి త్వరలోనే భారత్‌కు అధికారికంగా ఆహ్వానం కూడా పంపుతామని జర్మనీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సమావేశమే కాకుండా… జూన్‌లో జర్మనీ వేదికగా జరిగే మరో సమావేశానికి కూడా భారత్‌కు ఆహ్వానం ఉంటుందని జర్మనీ అధికారులు అనధికారికంగా పేర్కొంటున్నారు.
ఉక్రెయిన్- రష్యా మధ్య జరిగిన యుద్ధంలో భారత్ తటస్థ వైఖరి అవలంబించిన కారణంగా… జీ 7 సదస్సుకు భారత్‌ను ఆహ్వానించకూడదని జర్మనీ నిర్ణయించిందని మొదట్లో వార్తలు వచ్చాయి. కానీ.. ఆ తర్వాత జర్మనీ మనస్సు మార్చుకుందని, జీ 7 సదస్సుకు భారత్‌ను ఆహ్వానించిందుకు రెడీ అయిందని సమాచారం. జీ 7 సదస్సుకు భారత్‌కు ఆహ్వానం లేదని వార్తలు వస్తున్నా… భారత ప్రభుత్వం మాత్రం దీనిపై ఎలాంటి స్పందనా వ్యక్తం చేయలేదు. జర్మనీయే స్పందించి.. భారత్‌కు ఆహ్వానం పంపుతామని అనధికారికంగా పేర్కొంది.
తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/