పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

మాజీ ఎంపీ , కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆస్తుల విలువ రూ. 433.93 కోట్లు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బరిలో నిల్చున్న అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ దాఖలు చేసే క్రమంలో వారి ఆస్తుల విలువ తెలియజేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో నిన్న అధికార పార్టీ అభ్యర్థుల తో పాటు ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసారు. బీఆర్ఎస్ నుంచి పోచారం శ్రీనివాస్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి, యాదయ్య, హర్షవర్ధన్, కాంగ్రెస్ నుంచి శ్రీధర్ బాబు, పొంగులేటి, బీజేపీ నుంచి రాజాసింగ్, రమేష్ రాథోడ్ తదితరులు ఉన్నారు.

ఇప్పటివరకు నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల్లో అత్యధిక ఆస్తులున్న అభ్యర్థిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిలిచారు. ఆయన తన కుటుంబానికి రూ. 433.93 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అఫీడవిట్ లో ప్రకటించారు. ఆ తర్వాత స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్ రెడ్డి నిలిచారు. తన కుటుంబం పేరిట రూ. 227.51 కోట్ల ఆస్తులున్నట్లు వెల్లడించారు. తనకు రూ. 112.75 కోట్ల అప్పులు కూడా ఉన్నట్లు అఫిడవిట్ లో పేర్కొన్నారు.