ప్రయాణికులకు ఏపీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్

Good News to APSRTC

మరో మూడు రోజుల్లో సంక్రాంతి సంబరాలు మొదలుకానున్న నేపథ్యంలో APSRTC ప్రయాణికులకు గుడ్ న్యూస్ తెలిపింది. సంక్రాంతికి హైదరాబాద్ నుంచి కోనసీమకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. హైదరాబాద్ నుంచి అమలాపురంకు 57 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు అమలాపురం రీజనల్ మేనేజర్ నాగేశ్వరరావు వెల్లడించారు.

10,11,12,13 తేదీల్లో స్పెషల్ బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. రెగ్యులర్ గా 19 బస్సులుండగా.. అదనంగా ఈ బస్సులను ఏర్పాటు చేశామన్నారు. ప్రయాణికుల రద్దీని బట్టి బస్సుల సంఖ్యను మరింత పెంచుతామని తెలిపారు. హైదరాబాద్ నుంచి రావడానికి, తిరిగి వెళ్లడానికి ఒకేసారి రిజర్వేషన్ చేయించుకున్న వారికి 10 శాతం రాయితీ కూడా ఉంటుందని తెలిపారు. ఈ డిస్కౌంట్.. హైదరాబాద్ నుంచి ఏపీలో ఏ ప్రాంతానికి రిజర్వేషన్ చేయించుకున్నా ఉంటుందని తెలిపారు.

సంక్రాంతి అనగానే గుర్తొచ్చేవి గోదావరి జిల్లాలే. రంగురంగుల రంగవల్లులు, కోడిపందేలు, పిండివంటలు, అతిథి మర్యాదల్లో ఏమాత్రం తగ్గరు గోదారోళ్లు. సంక్రాంతి వచ్చిందంటే.. గోదావరి జిల్లాల ప్రజలు ఎక్కడున్నా.. పండక్కి సొంతూరికి చేరుకుంటారు. సంక్రాంతి సమయంలో ప్రయాణికుల రద్దీ ఊహించిన దానికంటే ఎక్కువగానే ఉంటుంది. అందుకే APSRTC ప్రత్యేక బస్సులను ఏర్పటు చేసింది.