ఖమ్మంలోని తుమ్మల నివాసంలో పోలీసుల సోదాలు

ప్రచారం కోసం తుమ్మల వెళ్లిన తర్వాత ఇంట్లోకి వచ్చిన పోలీసులు

police-searches-in-thummala-nageswara-rao-home

హైదరాబాద్‌ః ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించడం కలకలం రేపుతోంది. పోలీసులతో పాటు కొందరు రెవెన్యూ అధికారులు కూడా సోదాల్లో పాల్గొన్నారు. ఖమ్మం రూరల్ మండలంలోని శ్రీసిటీలోని తుమ్మల నివాసంలో ఈ సోదాలు జరిగాయి. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఈ ఉదయం తుమ్మల తన నివాసం నుంచి బయటకు వెళ్లిపోయారు. ఆయన వెళ్లిన తర్వాత పోలీసులు తుమ్మల ఇంట్లోకి వచ్చారు. ఆ సమయంలో ఇంట్లో తుమ్మల భార్యతో పాటు కొందరు అనుచరులు ఉన్నారు. మరోవైపు తుమ్మల నివాసంలో సోదాలపై కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. బిఆర్ఎస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఇబ్బంది పెట్టేందుకే బిఆర్ఎస్ పార్టీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని దుయ్యబడుతున్నాయి.