తెలంగాణ‌ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం

హైదరాబాద్: రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభమ‌య్యాయి. శాస‌న‌స‌భ‌ను స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండ‌లిని చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి ప్రారంభించారు. ఇవాళ స‌భ‌లో కేవ‌లం సంతాప తీర్మానాల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. నాగార్జున సాగ‌ర్ దివంగ‌త ఎమ్మెల్యే నోముల న‌ర్సింహ‌య్యతో పాటు ప‌లువురు మాజీ ఎమ్మెల్యేల మృతికి స‌భ సంతాపం తెలుప‌నుంది. అనంత‌రం స‌భ వాయిదా ప‌డ‌నుంది. రేపు గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి ధ‌న్య‌వాద తీర్మానంపై చ‌ర్చ చేప‌ట్ట‌నున్నారు. 18న బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/