రాజశేఖర్ రెడ్డి కోరితే.. మల్కాజ్ గిరిని దత్తత తీసుకుంటా: హరీష్ రావు

minister-harish-rao-speech-at-malkajgiri-election-campaign

హైదరాబాద్: మల్కాజ్ గిరి నియోజకవర్గం…హైదరాబాద్ నగరానికి గుండెకాయ వంటిదని మంత్రి హరీష్ రావు అన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బుధవారం ఉదయం మల్కాజ్ గిరిలో నిర్వహించిన బిఆర్ఎస్ ఎన్నికల ప్రచార సభలో హరీష్ రావు పాల్గొని ప్రసంగించారు.

“హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందిందని ప్రముఖులు ప్రశంసింస్తున్నారు. కాలుష్యం తక్కువగా ఉన్న నగరంగా హైదరాబాద్ కు గ్లోబల్ అవార్డులు వస్తున్నాయి. మర్రి రాజశేఖర్ రెడ్డి చేతిలో మైనంపల్లి ఓడిపోవడం ఖాయం. మైనంపల్లి డబ్బు మైనాన్ని ఓటుతో కరిగించండి. మైనంపల్లిలా నేను దిగజారి మాట్లడలేను. ఓటుతో మైనంపల్లికి ఓటర్లు గుణపాఠం చెప్పాలి. రాజశేఖర్ రెడ్డి కోరితే.. మల్కాజ్ గిరిని దత్తత తీసుకుంటా. మళ్లీ కెసిఆరే సిఎం అవుతారు. రాజశేఖర్ రెడ్డిని గెలిపించి.. కెసిఆర్ కు మద్దతు తెలపండి” అని హరీష్ పేర్కొన్నారు.