అగ్రిగోల్డ్ బాధితులను వెంటనే ఆదుకోవాలి

సీఎం జగన్‌కు రఘురామ మరో లేఖ

న్యూఢిల్లీ: సీఎం జగన్ కు ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖాస్త్రాలు కొనసాగుతున్నాయి. ఈసారి అగ్రిగోల్డ్ బాధితులను వెంటనే ఆదుకోవాలని కోరారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగా రూ. 11 వందల కోట్లను తక్షణమే విడుదల చేయాలని ఆ లేఖలో పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు అగ్రిగోల్డ్ ఆస్తులను అమ్మి బాధితులకు న్యాయం చేయాలని రఘురామ కోరారు. ఎన్నికల సమయంలో జగన్ ఇచ్చిన.. నెరవేరని హామీలను రఘురామ లేఖల ద్వారా గుర్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు నాలుగు లేఖలు రాశారు. సోమవారం అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించి ఐదో లేఖను రాశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/