డీజే టిల్లు సాంగ్ కు అదిరిపోయే స్టెప్స్ వేసిన పోలీసులు

రీసెంట్ గా తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డీహెచ్‌ శ్రీనివాస్‌ బతుకమ్మ వేడుకల్లో డీజే టిల్లు సాంగ్ కు అదిరిపోయే స్టెప్స్ వేసి వార్తల్లో నిలువగా..ఇప్పుడు ముషీరాబాద్ పోలీస్‌స్టేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో పోలీసులు ఊర మాస్ స్టెప్స్ వేసి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు అంబరాన్ని తాకుతున్నాయి. ఊరు , వాడ , పల్లె పట్టణం అనే తేడాలు లేకుండా రాజకీయ నేతలు , పోలీసులు ఇలా అంత కూడా బతుకమ్మ వేడుకల్లో భాగం అవుతున్నారు.

ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ముషీరాబాద్ పోలీస్‌స్టేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో పోలీసులు పాల్గొన్నారు. ఆడపడుచులతో కలిసి బతుకమ్మ నృత్యాలు, కోలాటాలు ఆడుతూ చిందులు వేశారు. నిత్యం ఉరుకులు పరుగులతో విధులు నిర్వంచే పోలీసులు.. డీజే టిల్లు సాంగ్‌కు వావ్ మూమెంట్లు వేసి.. అదరగొట్టేశారు. పైస్థాయి అధికారులు సైతం డ్యాన్సులు చేసి.. సిబ్బందిలో హుషారు రేకెత్తించారు. పోలీసులు టిల్లు సాంగ్‌పై డాన్స్ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.