క్షమాపణలు చెప్పిన పోలీసు జంట..

పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ చేసి విమర్శలు ఎదురుకున్న పోలీస్ జంట వారు చేసిన పనికి క్షేమపణలు తెలిపారు. పంజాగుట్ట పీఎస్ లో విధులు నిర్వహిస్తున్న లేడీ ఎస్సై భావన, ఏఆర్ ఎస్సై రావూరి కిషోర్..పేమించుకొని పెళ్లి చేసుకున్నారు. ఆగష్టు 25వ తేదీనే వారు పెళ్లి చేసుకోగా.. రీసెంట్ గా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫ్రీ వెడ్డింగ్ షూట్‌ తీశారు.

ఈ వీడియో వివాదంలోకి వెళ్ళింది. పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఖాకీ డ్రెస్సుల్లో, పోలీసుల వాహనాలను వాడుకుంటూ షూట్ చేయటంపై తీవ్ర దుమారం చెలరేగింది. పోలీసు వాహనాలను తమ పర్సనల్ వీడియో షూట్ కోసం వాడుకోవటం అధికార దుర్వినియోగమే అవుతుందని.. వాళ్లపై చర్యలు తీసుకోవాలంటూ నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వారు వారి చేసిన పనికి క్షేమపణలు తెలిపారు.

కొత్తగా పెళ్లయిన పోలీసు జంట సీపీ సీవీ ఆనంద్ ను కలిశారు. అనంతరం నవ దంపతులకు పెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. అయితే మొన్న జరిగిన ఫ్రీ వెడ్డింగ్ షూట్‌పై స్పందిస్తూ.. వ్యక్తిగత వేడుకలకు యూనిఫాం గౌరవాన్ని నిలబెట్టుకోవాలని సీపీ గుర్తు చేశారు. అంతేకాకుండా పోలీస్ శాఖను ఇబ్బంది పెట్టినందుకు నవ దంపతులు క్షమాపణలు చెప్పారన్నారు. వారు జీవితకాలం ప్రేమతో కలిసి ఉండాలని సీపీ సీవీ ఆనంద్ ఆకాంక్షించారు.