చంద్రబాబును తరలిస్తున్న రోడ్డు మార్గంలో టిడిపి శ్రేణుల నిరసనలు

పొదిలి నుంచి ఒంగోలు వైపు కాన్వాయ్ ను మళ్లించిన వైనం

police-changed-chandrababu-convoy-route-due-to-tdp-workers-protests

అమరావతిః టిడిపి అధినేత చంద్రబాబును నంద్యాలలో ఈ ఉదయం 6 గంటలకు పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆయనను అదుపులోకి తీసుకుని రోడ్డు మార్గంలో విజయవాడకు తరలిస్తున్నారు. తమ అధినేతలు అరెస్ట్ చేసిన నేపథ్యంలో టిడిపి శ్రేణులు ఎక్కడికక్కడ ఆందోళన కార్యక్రమాలను చేపట్టాయి. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. మరోవైపు చంద్రబాబును తరలిస్తున్న రోడ్డు మార్గంలో టిడిపి నేతలు, కార్యకర్తలు నిరసనలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో, చంద్రబాబు కాన్వాయ్ రూటును పోలీసులు మార్చారు. పొదిలి నుంచి ఒంగోలు వైపు కాన్వాయ్ ని మళ్లించారు. గుంటూరు మీదుగా విజయవాడకు తరలిస్తున్నారు.