మధ్యప్రదేశ్‌ సిఎం శివరాజ్ కు కరోనా

విషయాన్ని స్వయంగా వెల్లడించిన సిఎం

మధ్యప్రదేశ్‌ సిఎం శివరాజ్ కు కరోనా
cm-shivraj-singh-chouhan

భోపాల్‌: మ‌ధ్య‌ప్ర‌దేశ్ సిఎం, బిజెపి సీనియర్‌ నాయకుడు శివ‌రాజ్‌సింగ్ చౌహాన్‌కు కరోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో ఆయ‌న సెల్ఫ్ క్వారెంటైన్‌లోకి వెళ్లారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ఆయనే స్వయంగా వెల్లడించారు. ‘కరోనా లక్షణాలని అనుమానం రావడంతో పరీక్షలు చేసుకున్నా. ఆ పరీక్షలో కరోనా పాజిటివ్ అని తేలింది. నాతో వివిధ కార్యక్రమాలు, సమావేశాల్లో పాల్గొన్న వారందరూ కోవిడ్ పరీక్షలు చేసుకోండి. ఇదే నా విన్నపం. వారందరూ హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోండి’ అని ట్విట్టర్ వేదికగా శివరాజ్ విజ్ఞప్తి చేశారు. వైద్యుల సూచనల మేరకు సిఎం శివరాజ్ ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నారు. కోవిడ్ 19 సమీక్షా సమావేశాలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతానని శివరాజ్ ప్రకటించారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/