బ్రెజిల్‌లో 24 గంట‌ల్లో 55,891 కొత్త కేసులు

మొత్తం కేసుల సంఖ్య 23,43,366

corona cases – Brazil

బ్రసిలియా: బ్రెజిల్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతుంది. తాజాగా గ‌త 24 గంట‌ల్లో 55,891 క‌రోనా కేసులు కొత్త‌గా న‌మోద‌య్యాయి. దీంతో దేశం‌లో ఇప్ప‌టివ‌ర‌కు 23,43,366 మంది క‌రోనా బారిన ప‌డ్డారు. మొత్తం న‌మోదైన కేసుల్లో 15,90,264 మంది కోలుకున్నారు. శుక్ర‌వారం కొత్త‌గా 1156 మంది మ‌ర‌ణించ‌డంతో మొత్తం మృతుల సంఖ్య 85,238కి పెరిగింది. దీంతో ప్ర‌పంచంలో రోజువారీ అత్య‌ధిక కేసులు, మ‌ర‌ణాల‌తోపాటు మొత్తం కేసుల్లో కూడా అమెరికా త‌ర్వాత బ్రె‌జిల్ రెండో స్థానంలో నిలిచింది. దేశంలో గురువారం అత్య‌ధికంగా 59,661 కేసులు న‌మోద‌వ‌గా, 1311 మంది మ‌ర‌ణించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/