బాస్ సాంగ్ కు మంచు లక్ష్మి స్టెప్స్ ..

మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య నుండి బాస్ సాంగ్ రావడమే కాదు యూట్యూబ్ లో దుమ్ములేపుతున్న సంగతి తెలిసిందే. ఈ పాటకు చిన్న పిల్లల దగ్గరి నుండి పెద్దవారి వరకు స్టెప్స్ వేస్తూ వైరల్ చేస్తున్నారు. ఇక సినీ స్టార్స్ గురించి చెప్పాల్సిన పనే లేదు. చిరు స్టెప్స్ కు వారి స్టయిల్ లో కుమ్మేస్తున్నారు. తాజాగా మంచు లక్ష్మి సైతం బాస్ సాంగ్ కు స్టెప్స్ వేసింది. రంగస్థలం ఫేమ్ మహేష్ తో కలిసి లక్ష్మి స్టెప్స్ వేసింది.

ఈ వీడియో ను సోషల్ మీడియా లో షేర్ చేయడం తో నెటిజన్లు , మెగా అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. బాబీ డైరెక్ట్ చేస్తున్న వాల్తేర్ వీరయ్య లో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, మాస్ మహారాజా రవితేజ కీలక అతిథి పాత్రలో నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తోంది. సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.