అవినాష్‌ ఆత్మహత్యాయత్నానికి పోలీసులదే బాధ్యత

వైఎస్‌ఆర్‌సిపి అధికారంలోకి వచ్చాక టిడిపి నేతలను వేధిస్తున్నారు

kala venkata rao
kala venkata rao

శ్రీకాకుళం: వైఎస్‌ఆర్‌సిపి అధికారంలోకి వచ్చాక టిడిపి నేతలను వేధిస్తున్నారని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావ్‌ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ..ఎస్‌ఎంపురం మాజీ సర్పంచ్‌ అవినాష్‌ విషయంలో పోలీసుల తీరును ఖండిస్తున్నామని అన్నారు. అవినాష్‌ ఆత్మహత్యాయత్నానికి పోలీసులే బాధ్యత వహించాలని, బాధ్యులైన పోలీసు అధికారులను వెంటనే సస్పెండ్‌ చేయాలని కళా వెంకట్రావ్‌ డిమాండ్‌ చేశారు. వైఎస్‌ఆర్‌సిపి నేతలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తూ అల్లకల్లోలం సృష్టిస్తున్నారని కళావెంకట్రావ్‌ మండిపడ్డారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/