రాష్ట్రాల సరిహద్దులు మూసివేయండి

కేంద్రం ఆదేశాలు జారీ

AP-TS border

న్యూఢిల్లీ: అన్నిరాష్ట్రాల సరిహద్దులను మూసివేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.. కేవలం నిత్యావసర సరుకులను మాత్రమే అనుమతించాలని పేర్కొంది.

ఈమేరకు అన్ని రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. జిల్లా సరిహద్దులను కూడ మూసివేయాలని ఆదేశాలు జారీచేసింది.

ఇప్పటికే కొత్తగా వచ్చిన వారిని 14రోజలు క్వారంటైన్‌లోనే ఉంచాలని పేర్కొంది.. నిబంధనలు ఉల్లంఘించి ప్రయాణాలు చేస్తే కఠినంగా వ్యవరించాలని కేంద్ర ఆదేశాల్లో పేర్కొంది.

విద్యార్థులు, కార్మికులను ఇళ్లు ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని, అంతేకాకుండా నగరాల నుంచి ఇతర ప్రాంతాలకు ప్రయాణాలు లేకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com