ఆటోమొబైల్ రంగంపై కరోనా పంజా

Corona claw on the automobile sector

Beezing: కరోనా వైరస్ కారణంగా చైనాలో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. స్వల్ప వ్యవధిలోనే ఈ వైరస్ సోకి రెండు వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు. అలాగే కరోనా వైరస్ జనం ప్రాణాలనే కాదు, వ్యాపారాల జోరునూ తగ్గించేసింది. ముఖ్యంగా చైనాలో ఆటోమొబైల్ రంగం కరోనా ధాటికి కుదేలైంది. ప్రపంచంలోనే అతి పెద్ద ఆటోమొబైల్ మార్కెట్ అయిన చైనాలో కార్ల అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. ప్రస్తుత సీజన్ లో చైనాలో కేవలం నాలుగువేల తొ్మిది వందల తొమ్మది కార్లు అమ్ముడయ్యాయి. అదే గత ఏడాది ఈ సీజన్ లో వీటి అమ్మకాలు దాదాపు 60 వేలు. కరోనా భయంతో షోరూంలు మూతపడే పరిస్థితి వచ్చింది.ఒక వేళ షోరూం తెరిచినా కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చే నాథుడే కరవయ్యాడు. అలాగే ఆటోమొబైల్ స్పేర్ పార్టుల ఎగుమతి కూడా దారుణంగా పడిపోయింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/