బీహార్‌లో మళ్లీ ఎన్డీయే విజయం సాధిస్తుంది..మోడి

PM Shri Narendra Modi addresses public meeting in Forbesganj, Araria, Bihar.

బీహార్‌: బీహార్‌లో శాసనసభ ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్రమోడి ఈరోజు అర‌రియా జిల్లాలోని ఫోర్బ్స్‌గంజ్‌లో జ‌రిగిన స‌భ‌లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ..బీహార్‌లో మ‌ళ్లీ ఎన్డీయేను విజ‌యం సాధిస్తుంద‌ని ఆయన అన్నారు. బీహారీ ప్ర‌జ‌లు మ‌ళ్లీ ఎన్డీయేకే ప‌ట్టం క‌ట్ట‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఈరోజు జ‌రుగుతున్న పోలింగ్‌లో గ‌త ఎన్నిక‌ల‌తో పోలిస్తే ఉద‌యం 10 గంట‌ల వ‌ర‌కే అత్య‌ధిక పోలింగ్ జ‌రిగింద‌న్నారు. ఇది కేవ‌లం దేశానికి మాత్ర‌మే కాదు, ఇది ప్ర‌పంచానికి సందేశం అన్నారు. కోవిడ్ వేళ ప్ర‌జ‌లు భారీ సంఖ్య‌లో ఓటింగ్‌లో పాల్గొన్న‌ట్లు ఆయ‌న చెప్పారు. ఇది ప్ర‌జాస్వామ్యంలో ఉన్న శ‌క్తి అని, ప్ర‌తి బీహారీ ప్ర‌జాస్వామ్యం ప‌ట్ల అంకిత‌భావంతో ఉన్న‌ట్లు ప్రధాని మోడి తెలిపారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/