బీహార్‌ ఓటర్లనుద్దేశించి రాహుల్‌ ట్వీట్‌

ఓటు వేయండి.. మీకు నచ్చిన ప్రభుత్వం ఏర్పడుతుంది.. రాహుల్‌

బీహార్‌ ఓటర్లనుద్దేశించి రాహుల్‌ ట్వీట్‌
rahul-gandhi

న్యూఢిల్లీ: బీహార్‌లో రెండో దశ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఓటర్లనుద్దేశించి ట్వీట్‌ చేశారు. ‘ఓటు వేయండి.. మీకు నచ్చిన కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది’ అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. తాను కొర్హా, కిషన్‌గంజ్‌కు వస్తున్నానని.. పెరుగుతున్న నిరుద్యోగం, రైతుల ఎదుర్కొంటున్న సమస్యలు, బలహీనమైన ఆర్థిక వ్యవస్థగ వంటి అంశాలపై మాట్లాడనున్నట్లు రాహుల్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ మహాకూటమిలో భాగంగా ఆర్‌జేడీతో కలిసి పోటీ చేస్తోంది. 243 స్థానాలున్న బిహార్‌ అసెంబ్లీకి మొదటి విడత అక్టోబర్‌ 28న పోలింగ్‌ జరిగింది. రెండో దశ ఎన్నికలు 94 నియోజకవర్గాల్లో జరుగుతుండగా.. దాదాపు 1500 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మూడో విడత ఎన్నికలు ఈ నెల 7న జరుగనున్నాయి.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/