భారత్‌ బయోటెక్‌ను సందర్శించిన ప్రధాని

కొవిట్‌ టీకాపై ప్రధాని మోడి సమీక్ష

pm-modi-reaches-bharat-biotech

హైదరాబాద్‌: కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి ప్రక్రియలను పరిశీలించేందుకు ప్రధాని మోడి హైదరాబాదులో భారత్ బయోటెక్ క్యాంపస్ ను సందర్శించారు. ‘కొవాగ్జిన్‌’ తాజా పరిస్థితిపై భారత్‌ బయోటెక్‌ యాజమాన్యం, శాస్త్రవేత్తలు ప్రధానికి వివరించారు. టీకా అభివృద్ధిని సమీక్షించిన ప్రధాని ఈప్రయోగంలో పాల్గొన్న సిబ్బంది సమష్టి కృషిని ప్రశంసించారు.


కాగా, హకీంపేట విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి రాష్ట్ర ప్రభుత్వ తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ సోమేశ్‌కుమార్‌, కలెక్టర్‌ శ్వేతా మొహంతితో పాటు పలువురు అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గం ద్వారా జీనోమ్‌వ్యాలీకి చేరుకున్నారు. భారత్‌ బయోటెక్‌ సంస్థను సందర్శించారు. అనంతరం మోడి పూణేకు బయలుదేరి వెళ్లనున్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/