స్వామి వివేకనందకు ప్రధాని నివాళులు

పశ్చిమబెంగాల్: స్వామి వివేకానంద 150వ జయంతి సందర్భంగా ఆయనకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నివాళులు ఆర్పించారు. అందుకు సంబంధించిన ఫొటోలను PMO ట్విట్టర్ ద్వారా పంచుకుంది. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని కోల్కతాలో రెండురోజుల అధికార పర్యటనలో భాగంగా రామకృష్ణ మిషన్ ప్రధాన కార్యలయమైన బేలూరు మఠాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సందర్శించారు. హౌరా జిల్లాలోని మఠంలో రాత్రి బసచేసిన మోడీ ఇవాల ఉదయం స్వామి వివేకానంద ఆలయంలో జరిగిన ప్రభాత ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం ప్రధాన ఆలయాన్ని సందర్శించి శ్రీ రామకృష్ణ పరమహంసకు నివాళులర్పించారు. స్వామి వివేకానంద జయంత్సుత్సావాన్ని జాతీయ యువజన దినోత్సవంగా ఇవాళ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/