రాజధాని కోసం ఎన్నారైల నిరసనలు

కాలిఫోర్నియా: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని అమెరికాలోని వివిధ ప్రాంతాల్లోని ఎన్నారైలు డిమాండ్ చేశారు. సేవ్ అమరావతి.. సేవ్ ఆంధ్రప్రదేశ్ అని నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. కాలిఫోర్నియా, డల్లాస్, అట్లాంటా, సెయింట్, లూయిస్, బాల్బిమోర్, చార్లట్, ర్యాలీ, ఒమాహ, పోర్ట్లాండ్, బోస్టన్, హ్యూస్టన్, మిన్ని యాపోలిస్, కొలంబస్, కాన్వాస్ సిటీ తదితర ప్రాంతాల్లో నిరసనలు సమావేశాలు నిర్వహించారు. జరగాల్సింది అభివృద్ధి వికేంద్రీకరణ కానీ అధికార వికేంద్రీకరణ కాదు అని వారు గొంతెత్తి నినదించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/