మరికాసేపట్లో ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం..ప్రధాన అంశాలు ఇవే

ఏపీ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం గురువారం (అక్టోబర్ 28) ఉదయం 11 గంటలకు సచివాలయంలో మొదలుకానుంది. కేబినెట్‌ భేటీ అనంతరం సాయంత్రం సీఎం వైఎస్‌ జగన్‌.. గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌తో భేటీ కానున్నారు.

టీడీపీ పార్టీ కార్యాలయం సహా నేతలపై వైసీపీ శ్రేణుల దాడులపై ఇప్పటికే రాష్ట్రపతికి ప్రతిపక్షనేత చంద్రబాబు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో అరాచకపాలన జరుగుతోందని 356 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి పాలన విధించాలని చంద్రబాబు రాష్ట్రపతిని కోరారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి సహా ఇతర అంశాలపై గవర్నర్‌కు సీఎం జగన్ వివరణ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దాడులకు దారితీసిన పరిస్థితులను గవర్నర్‌కు సీఎం వివరించనున్నట్లు సమాచారం. దాడులకు ముందు టీడీపీ నేతలు తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన సీడీలు, ఇతర ఆధారాలను గవర్నర్‌కు సమర్పించే అవకాశాలున్నాయి.

ఇక మంత్రి వర్గ సమావేశంలో ప్రధానంగా చర్చించే అంశాలు ఇవే..

  • ఫిలిమ్ డెవెలప్ మెంట్ కార్పొరేషన్ పోర్టల్ ద్వారా సినిమా టికెట్ల ఆన్ లైన్ విక్రయ ప్రతిపాదనపై చర్చించే అవకాశం
  • అగ్రవర్ణాల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటు పై చర్చించే అవకాశం
  • అమ్మ ఒడి పథకం అమలు పై చర్చించే అవకాశం
  • రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణంపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటారని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
  • దేవాదాయ శాఖ చట్ట సవరణలపై చర్చించే అవకాశం
  • రాష్ట్రంలో గుట్కా నిషేదానికి చట్ట సవరణపై చర్చించే అవకాశం
  • వివిధ సంస్థల‌కు భూ కేటాయింపుల విషయంపై కేబినెట్‌లో చర్చ జరిగే అవకాశముంది.