బిజెపి మూడోసారి కేంద్రంలో అధికారం చేజిక్కించుకోవడం తథ్యం: యూకే పత్రికలో కథనం

ది గార్డియన్ పత్రికలో యూకే కాలమిస్ట్ హానా ఎల్లిస్ పీటర్స్ కథనం

PM Modi’s third straight term at Centre ‘almost an inevitability’, declares column in leading UK daily

న్యూఢిల్లీః ‘మూడు రాష్ట్రాల ఎన్నికల్లో విజయం..మోడీ అసాధారన పాప్యులారిటీ..రామమందిర ప్రారంభోత్సవం.. వెరసి ప్రధాని సారథ్యంలో బిజెపి మూడోసారి కేంద్రంలో అధికారం చేజిక్కించుకోవడం తథ్యం’ అని యూకే కాలమిస్ట్ హానా ఎల్లిస్ పీటర్స్ స్పష్టం చేశారు. ఈ మేరకు ది గార్డియన్ దినపత్రిలో తన కాలమ్‌లో అభిప్రాయపడ్డారు.

మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయాలు బిజెపి బలం ఉత్సాహం మరింత పెంచాయని హానా ఎల్లిస్ పీటర్స్ అభిప్రాయపడ్డారు. ఈ విజయాల అనంతరం ప్రధాని స్పందిస్తూ హ్యాట్ పక్కా అని పేర్కొనడాన్ని కూడా హానా ఎల్లిస్ తన కాలమ్‌లో ప్రస్తావించారు. ప్రస్తుతం దేశంలో రాజకీయ వాతావరణాన్ని బట్టి మోడీకి విజయావకాశాలు ఎక్కువని దేశంలో అధికశాతం పరిశీలకులు అభిప్రాయపడుతున్నట్టు తేల్చాచారు.

‘‘రాజకీయ ఉద్దండుడిగా ప్రధాని మోడీ పాప్యులారిటీ తోపాటూ బిజెపి హిందూ జాతీయ వాద ఎజెండా..హిందువులను ఆకట్టుకుంటున్నాయి. 2014 తరువాత రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో పరిస్థితులు మోడీకి అనుకూలంగా మారాయి’’ అని హానా పేర్కొన్నారు.

దక్షిణ, తూర్పు భారతంలో బిజెపి ప్రత్యర్థులు కొన్ని ప్రాంతాల్లో బలంగా ఉన్నప్పటికీ జాతీయ స్థాయిలో బలహీనంగా ఉందని చెప్పారు. కేవలం మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌పై అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయన అభిప్రాయం నెలకొందని చెప్పారు. అంతేకాకుండా, బిజెపి ప్రతిపక్షాల జాతీయ స్థాయి కూటమి ‘ఇండియా’లో కీలక అంశాల్లో ఏకాభిప్రాయం రావాల్సి ఉందని కూడా పేర్కొన్నారు. ఇప్పటికే బిజెపి ఎన్నికల కదనరంగంలోకి దిగిందని, వికసిత భారత సంకల్ప యాత్ర ఇందులో భాగమేనని పేర్కొన్నారు. బిజెపి విజయాల గురించి గ్రామల వరకూ చేర్చాలని అధికారులకు బాధ్యతలు అప్పగించినట్టు చెప్పారు. మోడీ పాప్యులారిటీ, సంక్షేమ పథకాలు, హిందుత్వ ఎజెండాతో బిజెపి వ్యూహాత్మకంగా వెళుతోందని అన్నారు.