దేశం కొత్తగా 636 కరోనా కేసులు నమోదు

corona virus
corona virus

న్యూఢిల్లీః భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. అయితే, నిన్నటితో పోలిస్తే నేడు కొత్త కేసుల్లో కాస్త తగ్గుదల కనిపిస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకూ 24 గంటల వ్యవధిలో 636 కొత్త కేసులు వెలుగు చూశాయి.

తాజా కేసులతో కలిపి దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 4,394కు చేరుకుంది. ఇక నిన్క ఒక్కరోజే మహమ్మారి కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,33,364కి ఎగబాకింది. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ కరోనా నుంచి 4,44,76,150 మంది కోలుకున్నారు.

ఇక నిన్న (శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకూ) దేశంలో 841 కొవిడ్‌-19 కేసులు నమోదైన విషయం తెలిసిందే. 227 రోజుల వ్యవధిలో ఇదే గరిష్ఠం. అంతకుముందు ఈ ఏడాది మే 19న 865 కేసులు నమోదయ్యాయి.