డీకే శివకుమార్ భావోద్వేగం

కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ భావోద్వేగానికి గురైయ్యారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సంపూర్ణ మెజార్టీ దిశగా దూసుకుపోతుంది. ఈ సందర్భంగా విజయానికి తాను పడిన కష్టాన్ని గుర్తు తెచ్చుకున్నారు శివకుమార్. మీడియాతో మాట్లాడుతూ కంటతడి పెట్టారు. కాంగ్రెస్ కార్యకర్తల కష్టానికి ఫలితం దక్కిందన్నారు. కార్యకర్తల కష్టంతోనే గెలిచామన్నారు. గెలిపించిన కర్ణాటక ప్రజలకు డీకే శివకుమార్ కృతజ్నతలు తెలిపారు. కర్ణాటక ప్రజలకు సాష్టాంగ నమస్కారం తెలిపారు.

తాను తీహార్ జైల్లో ఉన్నప్పుడు.. సోనియా గాంధీ తనను కలవడాన్ని ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. 2020లో శివకుమార్‌ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ చేసింది. ఆ సందర్భంగా సోనియా గాంధీ ఆయన్ని జైలులో పరామర్శించారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం వెనక కీలక పాత్ర పోషించిన డీకే అప్పటి విషయాల్ని గుర్తు చేసుకున్నారు. తన గెలుపునకు సంబంధించిన సర్టిఫికెట్ తీసుకోవడానికి రామనగర వచ్చిన సందర్భంగా డీకే ఈ వ్యాఖ్యలు చేశారు.