ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తెరాస పార్టీకి భారీ షాక్

ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తెరాస పార్టీకి భారీ షాక్

ఇప్పటికే హుజురాబాద్ ఉప ఎన్నికలో తెరాస పార్టీ కి భారీ షాక్ తగిలింది. ఈ షాక్ నుండి ఇంకా బయటకు రాకముందే మరో షాక్ తగిలింది. టీఆర్ఎస్ పార్టీ కి క‌రీంన‌గర్ మాజీ మేయ‌ర్ స‌ర్దార్ ర‌వీంద‌ర్ సింగ్ షాక్ ఇచ్చాడు. పార్టీ ప్రాథ‌మిక స‌భ్యత్వానికి ఆయన రాజీనామ చేశాడు. త‌న రాజీనామ లేఖ ను పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ కు పంపించాడు.

ఉద్యమ పార్టీ అయిన టీఆర్ఎస్ లో ఉద్య‌మ ద్రోహుల కే ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తున్నార‌ని కేసీఆర్ కు రాసిన‌ లేఖ లో ర‌వీంద‌ర్ సింగ్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో పార్టీ కోసం, రాష్ట్ర సాధ‌న కోసం పోరాడిన వారిని ప‌క్కన పెడుతున్నార‌ని అన్నారు. ఇక మంగళవారం క‌రీంన‌గర్ 51 వ డివిజ‌న్ కార్పొరేట‌ర్ స‌ర్దార్ ర‌వీంద‌ర్ సింగ్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల లో ఇండిపెండెంట్ గా నామినేష‌న్ వేశాడు. తన వెంట ఎమ్మెల్యేలు, మంత్రులు నామినేషన్ వేయడానికి రాలేదేమో కానీ.. ఓటర్లుంటే చాలు కదా అంటూ తనదైన శైలిలో స్పందించారు. క‌రీంన‌గ‌ర్ నుంచి ఎల్ ర‌మ‌ణ కు, భాను ప్ర‌కాశ్ ల‌ను ఎమ్మెల్సీ అభ్య‌ర్థులు గా టీఆర్ఎస్ ప్ర‌క‌టించింది. దీంతో స‌ర్దార్ ర‌వీంద‌ర్ సింగ్ టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పాడు.