కోవిడ్ వ్యాక్సినేషన్ లబ్ధిదారులతో ప్రధాని

YouTube video
PM Modi’s interaction with healthcare workers & Covid vaccination beneficiaries in Himachal Pradesh

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు ఉదయం హిమాచల్ ప్రదేశ్‌ కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌లో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ కూడా పాల్గొన్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ అమలులో హిమాచల్ ప్రదేశ్ ‘ఛాంపియన్‌’గా నిలిచిందని ప్రధాని ప్రశంసించారు. అర్హులైన వారందరికీ తొలి డోసు కోవిడ్ వ్యాక్సినేషన్ 100 శాతం ఇచ్చిన రికార్డును హిమాచల్ ప్రదేశ్ సొంతం చేసుకుందని అన్నారు. మూడింట ఒక వంతు మందికి సెకెండ్ డోస్ కూడా పూర్తి చేసిందని అన్నారు.

నేను గర్వంగా చెప్పుకునే అవకాశం హిమాచల్ ప్రదేశ్ కల్పించింది. రాష్ట్రం కనీస సౌకర్యాలకు కూడా నోచుకుని పరిస్థితిని నేను స్వయంగా చూసాను. ఇప్పుడు ఎంతో ఎదుగుతోంది. ఇందుకు ప్రభుత్వాన్ని, ఇక్కడి టీమ్స్‌ను అభినందిస్తున్నాను. కొండ ప్రాంత రాష్ట్రంగా లాజిస్టిక్స్, రవాణా, నిల్వ వంటి ఎన్నో అవరోధాలు రాష్ట్రంలో ఉన్నప్పటికీ ప్రభుత్వం ఈ అవరోధాలను అధిగమించిన తీరు శ్లాఘనీయం”అని ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్, ఆయన ప్రభుత్వాన్ని ప్రధాని ప్రశంసించారు. హిమాచల్ ప్రదేశ్‌తో పాటు సిక్కిం, దాద్రా నగర్ హవేలి కూడా అర్హులైన వారికి తొలి విడత 100 శాతం వ్యాక్సినేషన్ ఇచ్చాయని, పలు రాష్ట్రాలు కూడా ఈ లక్ష్యానికి చేరువలో ఉన్నాయని చెప్పారు.

తాజా కెరీర్ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/specials/career/