రజనీకాంత్‌కు ప్రధాని పుట్టినరోజు శుభాకాంక్షలు

శరద్ పవార్‌కు కూడా శుభాకాంక్షలు

pm-modi-wishes-sharad-pawar-and-rajinikanth-on-birthday

చెన్నై: నేడు తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు ప్రధాని మోడి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. అలాగే, నేడు 81వ పుట్టిన రోజు జరుపుకుంటున్న ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ కు కూడా ప్రధాని మోడి బర్త్ డే విషెస్ తెలిపారు.  ‘శరద్‌ పవార్‌ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను’ అని ప్రధాని ట్వీట్‌ చేశారు. 

కాగా, రాజకీయాల్లోకి రాబోతున్నట్టు ప్రకటించిన రజనీకాంత్‌కు ఈ బర్త్‌డే ప్రత్యేకంగా నిలవనుంది. తన పార్టీ పేరును కూడా రిజిస్ట్రేషన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ నెల 31న పార్టీ పేరు, గుర్తును వెల్లడించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో రజనీకాంత్ పార్టీ పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/