అన్నదాతల ఆందోళన..నేడు రహదారుల దిగ్బంధం
నేటితో 17వ రోజుకు చేరుకున్న ఉద్యమం

న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళన 17వ రోజు కొనసాగుతుంది. ప్రభుత్వంతో పలుమార్లు జరిగిన చర్చలు కొలిక్కి రాకపోవడంతో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయాలని రైతులు నిర్ణయించారు. ఇందులో భాగంగా నేడు ఢిల్లీజైపూర్, ఢిల్లీఆగ్రా రహదారులను దిగ్బంధించనున్నారు. టోల్ గేట్ల వద్ద రుసుము చెల్లించకుండా నిరసనలు చేపట్టనున్నట్టు రైతు నాయకులు తెలిపారు.
మరోవైపు, రైతుల ఆందోళనకు మద్దతుగా వివిధ రాష్ట్రాల నుంచి రైతులు పెద్ద ఎత్తున ఢిల్లీ సరిహద్దుకు చేరుకుంటున్నారు. రైతుల హెచ్చరిక నేపథ్యంలో టోల్గేట్ల వద్ద, ఢిల్లీ శివారులోనూ ప్రభుత్వం పెద్ద ఎత్తున బలగాలను మోహరించింది. అలాగే, పలు రహదారులను మూసివేశారు. రైతుల ఆందోళనకు తొలి నుంచి అండగా నిలుస్తున్న కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఈ నెల 14న పంజాబ్లో వేర్వేరుగా ఆందోళనలు చేపట్టనున్నాయి.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/