ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరిన‌ లాలూ ప్ర‌సాద్ యాద‌వ్

న్యూఢిల్లీ: ఆర్జేడీ నేత లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ తీవ్ర జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్నారు. దీంతో ఆయ‌న్ను నేడు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్ప‌త్రిలో చేర్పించారు. హాస్పిట‌ల్‌కు వెళ్లిన లాలూ ఆరోగ్యం క్షేమంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. మూడేళ్ల పాటు జైలుశిక్ష అనుభ‌వించిన లాలూ ఇటీవ‌ల బీహార్‌కు వెళ్లారు. దాణా కుంభ‌కోణం కేసులో ఆయ‌నుకు జార్ఖండ్ కోర్టు బెయిల్ మంజూరీ చేసిన విష‌యం తెలిసిందే. గ‌త రెండేళ్ల నుంచి రాంచీలోని రాజేంద్ర మెడిక‌ల్ ఇన్స్‌టిట్యూట్‌లో ఆయ‌న చికిత్స పొందుతున్నారు. అయితే ఈ ఏడాది జ‌న‌వ‌రిలో ఆయ‌న ఢిల్లీ ఎయిమ్స్‌కు వెళ్లారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/