కైకాల మరణం తెలుగువారికి తీరని లోటుః బాలకృష్ణ

తెలుగు వినీలాకాశం ఒక ధ్రువతారను కోల్పోయిందని వ్యాఖ్య

balakrishna-pays-condolences-to-kaikala-satyanarayana

హైదరాబాద్‌ః నట దిగ్గజం కైకాల సత్యనారాయణ మృతిపై సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఆహార్యం, అభినయం, ఆంగికాలతో అశేషాభిమానుల్ని సంపాదించుకున్న సీనియర్ నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి కైకాల సత్యనారాయణ మరణం చిత్ర పరిశ్రమతోపాటు, తెలుగువారికి తీరనిలోటు అని ఆయన అన్నారు. తెలుగు సినీ వినీలాకాశం ఒక గొప్ప ధ్రువతారను కోల్పోవడం విచారకరమని చెప్పారు. ఎన్టీఆర్ వంటి మహానుభావుడితో కలిసి సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాల్లో కైకాల చూపిన అభినయం ఎన్నటికీ మరువలేనిదని కొనియాడారు. సత్యనారాయణగారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబసభ్యులకు, వారి అభిమానులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని బాలకృష్ణ అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/