హైద‌రాబాద్‌లో రేపు ప్ర‌ధాని మోడీ రోడ్ షో

PM Modi roadshow tomorrow in Hyderabad

న్యూఢిల్లీః ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ శుక్ర‌వారం హైద‌రాబాద్‌లో రోడ్ షో నిర్వ‌హించ‌నున్నారు. ఆ త‌ర్వాత 16, 18 తేదీల్లో ఆయ‌న లోక్‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో బిజెపి త‌ర‌పున ప్ర‌చారం చేప‌డుతారు. శుక్ర‌వారం సాయంత్రం మిర్జాల‌గూడ నుంచి మ‌ల్కాజ్‌గిరి వ‌ర‌కు రోడ్ షో నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలంగాణ బిజెపి వ‌ర్గాలు తెలిపాయి. మార్చి 16వ తేదీన నాగ‌ర్‌క‌ర్నూల్‌లో జ‌ర‌గ‌నున్న ప‌బ్లిక్ మీటింగ్‌లో ఆయ‌న ప్ర‌సంగిస్తారు. మార్చి 18వ తేదీన జ‌గిత్యాల‌లో జ‌ర‌గ‌నున్న మీటింగ్‌లో ఆయ‌న పాల్గొంటారు.