కోవిడ్‌-19పై గెలిచిన వియత్నాం

16 మంది వైరస్‌ సోకిన రోగులకు నయం

Coronavirus patients cured in Vietnam
Coronavirus patients cured in Vietnam

వియత్నాం: ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతున్న సమయంలో, వియాత్నాం దేశంలో మాత్రం కరోనా అద్భుతం సృష్టించింది .మొత్తం 16 మంది కరోనా వైరస్ సోకిన రోగులను నయం చేసి ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేసినట్లు వియత్నాం ప్రకటించింది. బుధవారం నాటికి, మొత్తం 16 మంది రోగులను డిశ్చార్జ్ చేసిన వియత్నాం ఆరోగ్య శాఖ వారిలో 73 ఏళ్ళ వయసులో ఉన్న వృద్ధులకు కూడా నయమై ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారని పేర్కొంది. గత 15 రోజులుగా కొత్త కరోనా వైరస్ సోకిన కేసులను కూడా ప్రభుత్వం గుర్తించలేదు. చివరి కరోనా వైరస్ కేసు ఫిబ్రవరి 13 న నమోదయినట్లు ప్రకటించింది. హనోయికి ఉత్తరాన ఉన్న ఒక గ్రామం 20 రోజుల పాటు నిర్బంధంగా ఉన్న పరిస్థితి ఉందని చెప్పారు. నగర మరియు ప్రాంతీయ అధికారులతో ఆన్‌లైన్ సమావేశంలో మాట్లాడిన వియత్నాం ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉప ప్రధాన మంత్రి వు డక్ డ్యామ్ను కోవిడ్-19 తో పోరాడటం ఒక యుద్ధమైతే, మేము మొదటి రౌండ్లో గెలిచాము కాని మొత్తం యుద్ధంలో మాత్రం కాదని ఆయన పేర్కొన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/