ఢీ కొన్న రెండు ట్రక్కులు.. నలుగురు యాత్రికులు మృతి

truck-jumps-delhi-road-divider-hits-vehicle-carrying-kanwariyas-4-killed

న్యూఢిల్లీః ఢిల్లీ లోని అలీపూర్ లో గల జీటీ కర్నాల్ రోడ్డు లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో రెండు ట్రక్కులు ఢీ కొన్నాయి. దీంతో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. 15 మంది గాయపడ్డారు. కాగా, జీటీ కర్నాల్ మార్గంలో ఓ ట్రక్కు 20 మంది కన్వర్ యాత్రికులతో హరిద్వార్ కు వెళుతోంది. ఢిల్లీకి వస్తున్న మరో ట్రక్కు అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టి.. అనంతరం యాత్రికుల ట్రక్కుపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు యాత్రికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది గాయపడగా.. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు.